నెల్లూరు జిల్లాలోని అన్ని వీధి లైట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చామని విద్యుత్ శాఖ ఎస్ఈ కె.రాఘవేంద్రం సోమవారం తెలిపారు. రోజూ సాయంత్రం 5:30 గంటలకు ఆటోమేటిక్గా లైట్లు ఆన్ అవుతాయని చెప్పారు. ఉదయం 6:00 గంటలకు ఆఫ్ అవుతాయన్నారు. ఈ మార్పులతో వాటర్ వర్క్స్ సరఫరాకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సంబంధిత AE లేదా DEEలను సంప్రదించాలని సూచించారు.