AP: ఏలూరు జిల్లా పిల్లల విక్రయాల కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ముదినేపల్లి, ఏలూరు, భీమవరానికి చెందిన వీరమ్మ, చిన్ని, రెడ్డెమ్మ, గోపి, మాధురి, కలిక్ పట్టుబడ్డారు. ఈ ముఠాకు ఫరీనా కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. ఆమె నుంచి పిల్లలను కొనుగోలు చేసి అన్నవరం, కొనుకొల్లులోని దంపతులకు విక్రయించినట్లు విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.