ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానం సోమవారం మధిర టీచర్స్ కాలనీకి చెందిన ఎం.డి. ముస్తఫాకు చెల్లని చెక్కు కేసులో 18 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి బిందుప్రియ తీర్పునిచ్చారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన తూము వీరభద్రరావు వద్ద 2018లో రూ.10 లక్షలు అప్పు తీసుకుని, 2020లో ఇచ్చిన రూ.14.50 లక్షల చెక్కు బౌన్స్ కావడంతో కేసు నమోదైంది.