TG: ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం సుమారు రూ. 600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా సగటున రూ. 89 కోట్లు ఖర్చు చేస్తూ, మొత్తంగా రూ. 2,408 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను క్లియర్ చేశామని అన్నారు. ఎవరి పీఏలు CMRF సొమ్మును కాజేశారో తెలుసని చురకలంటించారు.