NZB: శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్స్, బార్లు, క్లబ్బులు మూసివేయాలని సీపీ పీ.సాయిచైతన్య ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రేపు ఉదయం 6 నుంచి 28 ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భక్తులు పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.