AP: కర్నూలు జిల్లాలోని గురురాఘవేంద్ర ప్రాజెక్టులో 7 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పుంగనూరు కెనాల్లో నీటి నిర్వాహణకు రూ.27.44 లక్షల చెల్లింపునుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేఘా సంస్థకు అప్పగించిన పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనుల కొనసాగింపును ఆమోదించింది. అలాగే కుప్పంలో పూలే స్కూల్లో సిబ్బంది భర్తీకి అనుమతిస్తూ.. జీవో విడుదల చేసింది.