KRNL: దేవనకొండ మండలం గుమ్మరాళ్ల పాలకుర్తిలో రైతు పెద్ద పెద్దయ్యకు చెందిన రెండు గడ్డి వాములు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. గ్రామస్థులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు గురువారం స్థానికులు తెలిపారు.