PPM: రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డిని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, పూలమొక్కను అందజేసి స్వాగతం తెలిపారు. ఆనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ మేరకు పోలీసు శాఖ చేపడుతున్న ప్రజాసేవలు, గిరిజనల సమస్యలు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.