KMM: కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ వైరా, గన్నవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను (MPPS) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా సామర్థ్యాలను (ECR) పరిశీలించి, విద్యా నాణ్యతపై MEO, హెడ్ మాస్టర్లు, CRPలతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల సమగ్ర పనితీరును ఉత్తమ స్థాయికి తీసుకెళ్లడానికి ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు.