KMM: మధిర బార్ అసోసియేషన్ ఎన్నికల్లో చావలి రామరాజు ప్యానెల్ గురువారం ఘనవిజయం సాధించింది. మొత్తం 39 ఓట్లు పోలవగా అధ్యక్ష పదవికి రామరాజుకు 24, కావూరి రమేష్‌కు 15 ఓట్లు వచ్చాయి. 9 ఓట్ల మెజార్టీతో రామరాజు గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా కోట జ్ఞానేశ్ 25 ఓట్లతో విజయం సాధించగా, పల్లపోతు కృష్ణరావుకు 14 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షురాలిగా సునీత 22 ఓట్లతో గెలిచారు.