TG: భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని, గత ప్రభుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు అత్యంత పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్తగా రూపొందించిన భూభారతిను వచ్చే నెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.