NGKL: కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద కృష్ణానది తీరాన అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నదిలో బ్యాక్‌వాటర్ తగ్గడంతో అడుగున ఉన్న పురాతన సంగమేశ్వర ఆలయం పూర్తిగా వెలుగులోకి వచ్చింది. ఏటా నీటిలో మునిగి ఉండే ఈ ప్రాచీన ఆలయం, నీటి మట్టం తగ్గడంతో ఇప్పుడు భక్తులకు పూర్తిస్థాయిలో దర్శనమిస్తోంది. ఆలయం బయటపడటంతో అర్చకులు భక్తులు కలిసి ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు.