శ్రీరామనవమి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో రేపు బ్యాంకులకు సెలవు ఉండనుంది. దీంతో పాటు ఎల్లుండి రెండో శనివారం, తర్వాత ఆదివారం రావడంతో బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. మరోవైపు మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బ్యాంకులు తెరుచుకుంటాయి.