MDCL: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో నియోజకవర్గ ప్రజల ఆస్తి సమస్యలను ప్రస్తావించారు. 76 కాలనీలలోని 384 ఎకరాలను వక్ఫ్ బోర్డు ఆస్తులుగా గుర్తించి 22-A జాబితాలో చేర్చడంతో సుమారు 18,000 ఇళ్ల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బ్యాంకు రుణాలు, రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలపై అడ్డంకులు ఏర్పడుతున్నాయని చెప్పారు.