SDPT: దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బంధారం గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ కె.హైమావతి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆమె, పాలకూర పప్పు మరీ పల్చగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన పోషకాహారం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Tags :