TG: GST సవరణ బిల్లుకు శాసనసభ అమోదం తెలిపింది. సేల్స్ టాక్స్ కమిషనర్ పోస్టును చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్‌గా మార్పు చేసింది. అలాగే అదనపు కమిషనర్ (గ్రేడ్-1) పోస్టును స్టేట్ టాక్స్ కమిషనర్‌గా మార్చుతూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. కేంద్రం, రాష్ట్రంలోని శాఖాధిపతుల మధ్య హోదాలో తేడాలు ఉండటం వల్ల వీటన్నింటిని యూనిఫామ్ చేసేందుకు ఈ చట్ట సవరణ చేసింది.