NGKL: అసెంబ్లీ జీరో అవర్లో ఇవాళ MLA రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తారు. జిల్లా కేంద్రం విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయన్నారు. జనాభా దృష్ట్యా జిల్లా కేంద్రంలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే GO జారీ చేసినట్లు ఆయన గుర్తు చేశారు.