శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారంగా త్రేతా యుగంలో భూమి మీద చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్తు లగ్నంలో రామచంద్రుడు కర్కాటకరాశిలో జన్మించాడు. ఆయన మరల చైత్ర శుద్ధ నవమి రోజున సీతామాతను వివాహమాడాడని రామాయణం చెబుతోంది. అప్పటి నుంచి చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున శ్రీ రామనవమి పండుగగా జరుపుకొంటూ శ్రీ సీతా రామ కళ్యాణం మహోత్సవాన్ని వాడవాడలా చేస్తున్నారు.