వాహనం నడిపేటప్పుడు తరచూ సడెన్ బ్రేకులు వేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగి మీ డబ్బు వృథా అవుతుంది. అందుకే ముందు వెళ్లే వాహనాలను, ట్రాఫిక్ సిగ్నళ్లను గమనిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. తద్వారా సడెన్ బ్రేకుల అవసరం లేకుండా ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. సురక్షితమైన ప్రయాణంతో పాటు ఖర్చును కూడా తగ్గించుకోండి.