KDP: పోరుమామిళ్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు HPV వ్యాక్సిన్ కార్యక్రమం ఉంటుందని DY హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాధు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం ఇవ్వడం జరుగుతుందన్నారు. 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలు తప్పక ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.