KNR: శంకరపట్నం మండలం కన్నాపూర్లో సీసీ రోడ్లు నిర్మాణానికి ఎన్ఆర్ఆజీఎస్ నిధులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామానికి రూ. 10 లక్షలు మంజూరు చేశారు. సర్పంచ్ రమా, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అశోక్, పీఎస్ రాజేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.