WNP: జిల్లాలోని ఘనపూర్ ఫోర్ట్, శ్రీ రంగనాయక స్వామి ఆలయం, సరళాసాగర్ వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డీపీఆర్ సిద్ధం చేస్తే ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని, జిల్లాను పర్యాటక హబ్‌గా మారుస్తామని ఆయన పేర్కొన్నారు.