SKLM: మందస(M) హరి పురం పెద్ద వీధిలో ఈ నెల 13న పొట్టి శాంతి ఇంట్లో జరిగిన 20 గ్రాముల బంగారం చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన ఒడిశాకు చెందిన ఉమా కాంత్ బిశ్వాల్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కృష్ణ ప్రసాద్ సోమవారం తెలిపారు. నిందితుడు నుండి 20 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.