W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ పార్టీలోకి పలు గ్రామాల నుంచి మంగళవారం భారీగా చేరారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి, ఆరుళ్ళ,దండగర్ర గ్రామాల నుంచి గతంలో పార్టీని విడిచి వెళ్లిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు చేరారు. వీరికి పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డే రఘురామ్ నాయుడు పార్టీ కండువా వేసి సుమారు 80 మంది పార్టీలోకి ఆహ్వానించారు.