TG: రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు పూర్తిగా స్తంభించాయి. దీంతో భూ బదలాయింపులు, స్లాట్ బుకింగ్, ఈసీలు, చలాన్ల చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో క్రయవిక్రయదారులు కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు. సాంకేతిక సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.