హాలీవుడ్ సీనియర్ నటి వాలెరీ పెర్రిన్ (82) కన్నుమూశారు. గత పదేళ్లుగా పార్కిన్సన్స్ వ్యాధితో పోరాడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. 1978లో వచ్చిన ‘సూపర్‌మ్యాన్’ చిత్రంలో లెక్స్ లూథర్ గర్ల్‌ఫ్రెండ్ ‘మిస్ టెష్మాకర్’ పాత్రలో ఆమె పోషించిన నటన మరువలేనిది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, తన గ్లామర్, నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు.