SKLM: పోలాకి మండలం డీఎల్పురంలోని అమ్మవారిని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంగళవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, మండల అధ్యక్షులు కణితి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.