E.G: సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు బ్యాంకర్లు తప్పనిసరిగా పంట రుణాలు మంజూరు చేయాలని జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాధాన్యతా రంగంలో రూ.18,843 కోట్ల రుణ లక్ష్యానికి గాను 3వ త్రైమాసికం ముగిసే నాటికి రూ.16,269 కోట్ల రుణాలు మంజూరు చేసి 86.33 శాతం ప్రగతి సాధించినట్లు చెప్పారు.