వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడాన్ని ప్రధాని మోదీ రాజ్యసభలో ఖండించారు. హార్ముజ్ జలసంధిని మూసివేయడం సరైనది కాదన్నారు. దౌత్యం ద్వారా భారత నౌకలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ యుద్ధం మానవాళికి మంచిది కాదన్నారు. అన్ని పక్షాలు శాంతంగా ఉండాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు.