పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లోని శ్రీలీల ఎపిసోడ్ మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందని, ఆ ట్రాక్ కోసమే మహిళలు భారీగా థియేటర్లకు వస్తున్నారని తెలిపాడు. పవన్‌ను ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా చూపిస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉందన్నాడు.