MBNR: నవాబ్‌పేట మండలం రుద్రారంలో సర్పంచ్ రవి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఎస్సై విక్రమ్, ఎంపీడీవో జయరాం నాయక్ ప్రారంభించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు. అనవసరంగా ఎండలో తిరగొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్థులను కోరారు.