BHNG: చౌటుప్పల్ సీతారామచంద్రస్వామి దేవస్థాన కళ్యాణ మహోత్సవానికి రావాలని కోరుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. మంగళవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీ.మురళి, పురపాలక వైస్ ఛైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ పాల్గొన్నారు.