MDK: మెదక్ పసుపులేరు వాగు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 60 టన్నుల ఇసుకను ఇసుక బజారుకు తరలించినట్లు ఆర్ఐ లక్ష్మణ్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పసుపులేరు వాగు వద్ద, ఎల్లమ్మ గుడి వద్ద నిలువ ఉంచిన ఇసుకను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అక్రమ ఇసుక రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.