AP: నంద్యాలలో ఫుడ్ పాయిజన్ కేసులపై మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. ఆసుపత్రుల్లో ఉన్న 10 మంది పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. వాంతులు, విరోచనాలతో బాధితులు ఆసుపత్రిలో చేరినట్లు మంత్రికి వివరించారు. బాధితుల ఇళ్ల వద్ద సర్వే చేసినట్లు చెప్పారు. కాగా, వివాహంలో మిగిలిన ఆహారాన్ని బుడగ జంగాల కాలనీలో పంచిపెట్టారు. ఈ ఆహారాన్ని తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు.