HNK: ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని DMHO డా. అల్లం అప్పయ్య, కార్పొరేటర్ డా. సర్తాజ్ బేగంలు సూచించారు. ‘ప్రజా పాలన -ప్రగతిప్రణాళిక’ ఈ కార్యక్రమంలో భాగంగా 48వ డివిజన్ పరిధిలోని బోడగుట్టలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని DMHO సందర్శించి, వైద్య అధికారులకు సిబ్బందికి సూచనలు చేశారు.