KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో పన్ను చెల్లించేవారు మార్చి చివరిలోపు చెల్లించాలని, గడువు లోపల చెల్లించని పన్నులకు విధించే వడ్డీలో రాయితీ అవకాశం ఉండదని మున్సిపాలిటీ కమిషనర్ రంగస్వామి ఇవాళ తెలిపారు. మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పన్నులు సకాలంలో చెల్లించేందుకు ప్రజలు పాటు పడాలన్నారు.