CTR: పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ హరగోపాల్ నాయక్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ వ్యాధికి పూర్తిస్థాయిలో ఉచిత చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.