SRD: సిర్గాపూర్ మండలంలోని కడ్పల్ టీబీ రహిత గ్రామంగా ఎన్నుకున్నట్లు జిల్లా టీబీ సూపర్వైజర్ అరుణకుమారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సంగారెడ్డిలో సర్పంచ్ మల్లగారి విమల విట్టల్ రెడ్డి, కార్యదర్శి అరుణ్ కుమార్ను అభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు. గ్రామంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామని సర్పంచ్ అన్నారు.