E.G: వేసవి దృష్టిలో ఉంచుకుని లో వోల్టేజీ సమస్య లేకుండా విద్యుత్ లైన్లను ఆధునీకరణ చేస్తున్నామని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవలేశ్వరం, హుకుంపేటలో పలు సమస్యలను ఎమ్మెల్యే పరిశీలించి స్థానికుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.