SDPT: హుస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామం నుంచి మాలపల్లి గ్రామానికి వెళ్లే తాళ్లచెరువు వాగుపై బ్రిడ్జీ నిర్మాణం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వాగులపై బ్రిడ్జ్‌లు లేకపోవడంతో రైతులు తమ వ్యవసాయ భూములకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించాలన్నారు.