PDPL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ ఇద్దరు మహిళలకు యూరాలజీ శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు డా. శ్రీధర్ తెలిపారు. కొలనూర్కు చెందిన మహిళకు కిడ్నీలోని 2 సీఎం స్టోన్ అధునాతన శస్త్ర చికిత్స ద్వారా తొలగించామన్నారు. గోదావరిఖని మహిళకు గతంలో కిడ్నీ రాళ్ల సమస్యతో DJ-స్టంట్ వేయగా, ఈరోజు శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు.