W.G: ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ముఖ్యంగా పేదల సొంతింటి కల నెరవేర్చాలని కోరుతూ.. భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు మంగళవారం ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రం తహసీల్దార్ రాంబాబుకి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ పెన్మెత్స దుర్గాభవాని పాల్గొన్నారు.