MDK: ఉపాధి హామీ పథకంలో రోజువారి వేతనం రూ. 307 వచ్చే విధంగా కొలతల ప్రకారం పనులు నిర్వహించాలని ఎంపీడీవో సతీష్ పేర్కొన్నారు. తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఎండలు పెరుగుతున్నందున ఉదయం తొందరగా పనులకు రావాలని సూచించారు. నూతన పద్ధతిలో ముఖ ఫోటో హాజరు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.