అన్నమయ్య జిల్లాలో టమాటా ధరలు పతనం దిశగా పరుగులు తీస్తున్నాయి. మదనపల్లె మార్కెట్లో 10కిలోల మొదటి రకం బాక్స్ రూ.110 పలికింది. రెండో రకం రూ.90, మూడో రకం రూ.85 చొప్పున పలకడంతో రైతులు నిరాశకు లోనయ్యారు. మార్కెట్కు కేవలం 119 మెట్రిక్ టన్నుల పంట మాత్రమే వచ్చిందని తెలిపారు.