PDPL: సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న క్యాత్ ల్యాబ్ పనులను వెంటనే పూర్తి చేయాలని CMO డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ఆదేశించారు. రెనే ఆసుపత్రి ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు త్వరలో గుండె వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు బాలకోటయ్య, రాజేశ్వర్ రావు, రమేష్, బంగారి స్వామి పాల్గొన్నారు.