TG: హైదరాబాద్‌లోని చాలా చోట్ల పెట్రోల్‌బంకులు మూతపడ్డాయి. ఉప్పల్, మల్లాపూర్, ఘట్కేసర్, అత్తాపూర్, తార్నాక వంటి ప్రాంతాలలో బంకుల ముందు ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులలో ఆందోళన నెలకొంది. మిగతా ప్రాంతాలలో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు భారీగా క్యూలు కడుతున్నారు.