NRPT: హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం నారాయణపేట జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ లోగోను మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించి యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్, సెక్రటరీ రామ్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.