MNCL: బెల్లంపల్లి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ అర్హుల జాబితా విషయంలో రీ ఎంక్వైరీ జరపాలని 14వ వార్డ్ కౌన్సిలర్ మధు కోరారు. సోమవారం బెల్లంపల్లి MRO కార్యాలయంలో MRO కృష్ణకు వార్డ్ ప్రజలతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా డబుల్ బెడ్ రూమ్ అర్హుల జాబితాలో అనర్హులను చేర్చారన్నారు. లక్కీ డ్రా లేకుండా అర్హులైన పేదలకు ఇళ్ళు కేటాయించాలన్నారు.