KDP: కొండాపురం మండలంలోని రేగడపల్లి సచివాలయంలో మంగళవారం డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రభుత్వం కోళ్లను పంపిణీ చేసింది. మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రేగడపల్లి, వెంకటాపురం, ఎనుమచింతల గ్రామాలకు చెందిన లబ్దిదారులకు కోళ్లను అందజేశారు. కోళ్ల పెంపకం ద్వారా కుటుంబాల ఆదాయం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.