KMM: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే కల్లూరు-తల్లాడ జాతీయ రహదారి లో తల్లాడ మండలం నూతనకల్ గ్రామ సమీపంలో రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుకుంటున్నారు.